Bomb squad checks
-
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోని బాంబ్ స్క్వాడ్
ఆగ్రా: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం, బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజ్‌మహల్ వద్ద సోదాల అనంతరం.. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Uttar Pradesh | Taj Mahal in Agra received a bomb threat via email todayACP Taj Security Syed Areeb Ahmed says, "Tourism department received the email. Based on that, a case is being registered at Tajganj police station. Further investigation is being done..."(Pics: ACP Taj… pic.twitter.com/1lw3E34dOM— ANI (@ANI) December 3, 2024 -
Shamshabad: బాంబు బెదిరింపు కలకలం.. ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అనంతరం, బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టింది. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి బాంబ్ మెసేజ్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. జీఎంఆర్ కస్టమర్ కేర్‌కు ఈ మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, సదరు మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
భద్రం బీకేర్‌ఫుల్..
సాక్షి, హైదరాబాద్: ఆర్టికల్ 370 రద్దు చేసిన పరిస్థితుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని విమానాశ్రాయాలపై కేంద్రం డేగ కన్ను వేసింది. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించిన పౌరవిమానయాన భద్రతా విభాగం (బీసీఏఎస్) విమానాశ్రయాల లోపల, బయట తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరిస్తూ అన్ని విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డింగ్ వేళల సవరణ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విమానాశ్రయాల్లోని అణువణువూ గాలించేలా బీసీఏఎస్ భద్రతా నియామావళిని జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలోకి ప్రవేశించే ద్వారం వద్ద నుంచి విమానం లోపలికి వెళ్లేంతవరకు ప్రయాణికుల తనిఖీల్లో నిర్లిప్తత ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని బీసీఏఎస్ స్పష్టం చేసింది. ప్రయాణికుల బోర్డింగ్ వేళలను కూడా సవరించింది. ఈ మేరకు పాటించాల్సిన విధివిధానాలను ఎయిర్‌లైన్ సంస్థలకు పంపింది. దీనికనుగుణంగా బోర్డింగ్ పాస్ కోసం స్వదేశీ ప్రయాణికులు ఫ్లైట్ షెడ్యూల్‌కు మూడు గంటలకు ముందు, విదేశీయానానికి నాలుగు గంటల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది గంట, గంటన్నరలోపే ఉండగా.. దీనిని నాలుగు గంటల వరకు పెంచారు. ప్రయాణికులతో పాటు వారు వచ్చే వాహనాలపై కూడా నిఘా ఉంచాలని నిర్ణయిం చారు. ప్రయాణికులు పార్కింగ్ చేసే వాహనాలను ర్యాండమ్‌గా సమగ్ర తనిఖీలు చేయనున్నారు. అదనపు చెక్‌పోస్టుల ఏర్పాటు.. ప్రయాణికులు, వారు సంచరించే ప్రాంతాలే కాకుండా టర్మినళ్లు, విమానాల గ్రౌండింగ్ పాయింట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని బీసీఏఎస్ సూచించింది. అవసరమనుకుంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఆసాంతం డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేయాలని పేర్కొంది. కార్గో టర్మినళ్ల విషయంలో కూడా ఏమాత్రం అలసత్వం చేయకుండా చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని, ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకునే మార్గంలోనూ చెక్‌పోస్టులను విస్తృతం చేయాలని ఆదేశించింది. విమానాశ్రయాలకు వచ్చే సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 20వరకు అనుమతించకూడదని స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ వారమంతా విమానాశ్రయాల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అపప్రద రాకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకునేలా బీసీఏఎస్ ఆదేశాలు జారీ చేసింది. -
హయత్ నగర్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హయత్‌నగర్‌లోని హయత్బక్షీ బేగం మసీదుతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. గంగా జమున తహజీబ్‌కు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
కలెక్టరేట్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
మెటల్ డిటెక్టర్ ఏర్పాటు కలెక్టరేట్‌లోకి వాహనాలకు అనుమతి లేదు నెల్లూరు (పొగతోట) : ఐఏఎస్ అధికారులు, కలెక్టరేట్లకు ఉగ్రవాదులు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం, రెండు నెలల కిందట జిల్లా కోర్టులో ప్రాంగణంలో బాంబు పేలిన ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం కలెక్టరేట్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్లో ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని పరిశీలించి పంపుతున్నారు. ప్రతి రోజు మెటల్ డిటెక్టర్‌తో పరిశీలించిన తర్వాతనే కలెక్టరేట్‌లోకి అనుమతి ఇస్తారు. చాలా కాలంగా కలెక్టరేట్ అవరణ పార్కింగ్ ప్రదేశంగా మారిపోయింది. జిల్లా అధికారుల వాహనాలు, కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగుల వాహనాలు కాకుండా ఇతరుల వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. కలెక్టరేట్ చుట్టుపక్కల నివశించే వారు, వ్యాపారులు వారి వాహనాలను కలెక్టరేట్లో పార్కింగ్ చేస్తున్నారు. రాత్రి సమయంలో ప్రైవేట్ వ్యక్తులు వారి కార్లను తీసుకువచ్చి కలెక్టరేట్లో పార్కింగ్ చేస్తున్నారు. వాహనాల్లో బాంబులు పెట్టే అవకాశం ఉండటంతో గురువారం నుంచి వాహనాలను కలెక్టరేట్‌లోకి ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల వాహనాలు కూడా గోల్డెన్ జూబ్లీ హాలు ప్రాంతంలో పార్కింగ్ చేసే అవకాశం ఉంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్‌ను కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్‌ఇంతియాజ్ పరిశీలించారు. -
పోలీస్ అలర్ట్
మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన ► జిల్లా పోలీసులుగుంటూరులోని బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ►అదే సందర్భంగా గుంటూరులో తుపాకీ కలకలంతో ఉలికిపాటు ►నల్లమలలోనూ కొనసాగుతున్న కూంబింగ్ సాక్షి, గుంటూరు: జిల్లా పోలీసులు ఆదివారం రాత్రినుంచి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రోడ్లపై వాహనాలు తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ.. మావోయిస్ట్ కదలికలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు నగరంలోనైతే బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు హడలిపోయారు. అసలు పోలీసులు ఇంత హడావుడి ఎందుకు చేశారంటే ఈ నెల 28 నుంచి మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతుండటమే. దీనిపై ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరంతా అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉంటే గుంటూరు నగరంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ వదలి వెళ్ళడంతో ఇదేమైనా మావోయిస్ట్‌ల పనా.. అనే దానిపైనా పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఉపాకీ గురించి వివరాలు అడగడంతో అర్బన్ ఓఎస్డీ జగన్నాథ్‌రెడ్డి హుటాహుటిన అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తుపాకీని పరిశీలించి, అది ఎయిర్‌గన్ అని తెలుసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఊపిరి పీల్చుకున్నారు. గత నెలలో ఎన్కౌంటర్ కూడా కారణమే... జిల్లాలో మావోయిస్ట్ కదలికలు లేవని చెబుతూనే గత నెలలో నల్లమల అటవీ ప్రాంతంలోని గుంటూరు- ప్రకాశం బోర్డర్లో గుంటూరు ఏఎన్ఎస్ పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్ట్ ముఖ్య నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో మావోయిస్ట్ జిల్లాకమిటీ సభ్యుడు జాన్ బాబూరావుతోపాటు విమల, భారతి అలియాస్ నిర్మల అనే ముగ్గురు మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో మావోయిస్ట్ విక్రమ్‌కు తీవ్ర గాయాలైనప్పటికీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు నల్లమలను జల్లెడపడుతున్నప్పటికీ ఇంత వరకూ విక్రమ్ ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీనికితోడు జాన్ బాబూరావు రిక్రూమెంట్ చేసేందుకే బయటకు వచ్చాడని తేలడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆగస్టు మూడు వరకూ వారోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్ట్ వారోత్సవాలు నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మండల కేంద్రాల్లో పోలీసులు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నాకా బంధీ నిర్వహించారు. గ్రామాల్లో మావోయిస్ట్ సానుభూతిపరులుగా అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచారు. గుంటూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో ఫ్లాట్పామ్లు, పార్శిల్ కార్యాలయం, వ్యాపార సముదాయాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు.