ఆగ్రా: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం, బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజ్‌మహల్ వద్ద సోదాల అనంతరం.. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Uttar Pradesh | Taj Mahal in Agra received a bomb threat via email today
ACP Taj Security Syed Areeb Ahmed says, "Tourism department received the email. Based on that, a case is being registered at Tajganj police station. Further investigation is being done..."
(Pics: ACP Taj… pic.twitter.com/1lw3E34dOM— ANI (@ANI) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment