shamshabad air port
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఆర్జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. -
Shamshabad: బాంబు బెదిరింపు కలకలం.. ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అనంతరం, బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టింది. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి బాంబ్ మెసేజ్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. జీఎంఆర్ కస్టమర్ కేర్‌కు ఈ మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, సదరు మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
రెంటికీ రెడ్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: కేవలం రూ. 25 చార్జీతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేలా ఎంఎంటీఎస్ నడిపేందుకు నాలుగేళ్ల క్రితం దక్షిణమధ్య రైల్వే ముందుకొచ్చింది. కానీ రైల్వేస్టేషన్ ఏర్పాటుకు జీఎమ్మార్ నిరాకరించడంతో ప్రతిష్టంభన నెలకొంది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు రూ. 9000 కోట్లతో 32 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మించనున్నట్లు ప్రభుత్వం తరచూ ప్రకటిస్తోంది. కానీ నష్టాల్లో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఎయిర్‌పోర్టుకు పరుగులు పెట్టే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. కేవలం రూ.250 కోట్లతో ఎంఎంటీఎస్ పూర్తి చేస్తే ఎయిర్‌పోర్టుకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు లోకల్ రైళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంఎంటీఎస్ పరుగులు పెట్టడం సులభమే. బెంగళూరులో లోకల్ ట్రైన్ పరుగులు ⇔ బెంగళూర్‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 కి.మీ దూరంలోని రైల్వేస్టేషన్ కొద్దిరోజులుగా ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో సందడిగా మారింది. విమానాల రాకపోకలతో పాటు అన్ని వివరాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. ⇔ ఆ రైల్వేస్టేషన్ నుంచి టెర్మినల్‌కు చేరుకొనేందుకు షటిల్ సర్వీసులు నడుస్తున్నాయి. కానీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి అనుమతి లభిస్తే ప్రయాణికులు ట్రైన్ దిగి నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా రైళ్లను నడపనున్నట్లు ద.మ రైల్వే గతంలో స్పష్టం చేసింది. ⇔ రైల్వేస్టేషన్‌కు స్థలాన్ని ఇచ్చేందుకు జీఎమ్మార్ నిరాకరించింది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తే భూగర్భ స్టేషన్ నిర్మాణానికి అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ⇔ నగరంలోని వివిధ మార్గాల్లో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తున్న మెట్రో రైళ్లు కి.మీ కూడా అదనంగా పరుగెత్తే అవకాశం ఇప్పట్లో లేదు. ‘బెంగళూరు ప్రయాణికులు రూ.20 లోపు చార్జీలతోనే ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. ఎంఎంటీఎస్‌కు అవకాశం లభిస్తే హైదరాబాద్‌లోనూ అలాంటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని ద.మ. రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఉందానగర్ నుంచి 6 కి.మీ ⇔ ఎంఎంటీఎస్ రెండో దశలో ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు సింగిల్ లైన్‌ను డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు 6 కి.మీ వరకు కొత్తగా లైన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ,250 కోట్లు ఖర్చవుతుందని 2013లోనే అంచనాలు రూపొందించారు. ⇔ రెండో దశలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని భావించినప్పటికీ జీఎమ్మార్ నిరాకరించడంతో పాటు ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ⇔ నగర శివార్లను కలుపుతూ ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కొరత వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.550 కోట్లు విడుదల కాకపోవడంతో లైన్ల నిర్మాణం పూర్తయినా రైళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. ⇔ రెండో దశ పూర్తయితే సికింద్రాబాద్– ఘట్కేసర్, సికింద్రాబాద్– బొల్లారం, మౌలాలీ– నగత్నగర్, తెల్లాపూర్– బీహెచ్ఈఎల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఎయిర్‌పోర్టు– ఉందానగర్ మధ్య రైళ్లు నడుస్తాయి. యాదాద్రి అంతే.. ⇔ రూ.330 కోట్లతో రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతిపాదించిన యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కూడా నిధుల కొరత కారణంగా పడకేసింది. ⇔ ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పొడిగించాల్సి ఉంది. అక్కడి నుంచి మరో 6 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్తారు. కానీ ఈ ప్రాజెక్టు సర్వేకే పరిమితమైంది. -
‘వారిని రప్పించేందుకు విదేశాంగ శాఖకు విజ్ఞప్తి’
సాక్షి, విజయవాడ: విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వలస కార్మికులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని రాష్ట్రానికి తరలించే విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతార్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి వస్తున్న వారందరిని సోంత రాష్ట్రాలతో సంబంధం లేకుండా క్వారంటైన్కె తరలించాలిన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని పెర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన చెప్పారు. (వలస కార్మికుల రాకతో రాష్ట్రంలో హైఅలర్ట్ ) ఏపీ తరపున శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక రిషెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అయితే పెయిడ్ క్వారంటైన్‌కు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని, దీని వల్ల గల్ఫ్ నుంచి వస్తున్న వలస కార్మికులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీకి చెందిన వారిని విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని, దీనిపై విదేశాంగ అధికారులు కూడా సంప్రదిస్తున్నామని చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే శంషాబాద్‌లోని విమానాశ్రయంలో ఏపీ వారి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామిన ఆయన తెలిపారు. -
శంషాబాద్ వద్ద నలుగురు క్యాబ్ డ్రైవర్ల అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లో నలుగురు క్యాబ్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు నలుగురినీ అరెస్ట్ చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో మరిన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉబెర్ క్యాబ్‌లను నిషేధించారు. హైదరాబాద్‌లో కూడా ఉబెర్ క్యాబ్‌లను నిషేధించారు. -
6 నెలలు.. 70 కేజీలు
-
6 నెలలు.. 70 కేజీలు
* అక్రమ బంగారం దుబాయ్ టు హైదరాబాద్ * సినీ ఫక్కీలో స్మగ్లింగ్ * సహకరిస్తున్న కస్టమ్స్, విమాన, హౌస్ కీపింగ్ సిబ్బంది! * క్యారియర్లకు ప్రత్యేక సర్జరీల ద్వారా శరీరంలో ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణాకు సంబంధించిన బంగారం అక్షరాలా 70 కేజీల పైమాటే. ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి ‘దిగుమతి’అయిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. లాభసాటిగా మారిన ఈ వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన కొందరు బడా వ్యాపారులు, పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థల అధిపతులు క్యారియర్లను ఏర్పాటు చేసుకుని వ్యవస్థీకృతంగా నడుపుతున్నారని కస్టమ్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 1,326 డాలర్లు ఉంది. బంగారం అక్కడ కొనుగోలు చేసి అధికారికంగా తీసుకురావాలన్నా పన్ను విధానంతో అది లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రం ఉండేది. ఆ తరవాత కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పది గ్రాములకు కనీసం రూ.మూడు వేల వరకు పన్ను కట్టాల్సివస్తోంది. ఈ లెక్కన కేజీ బంగారం దేశీయ మార్కెట్ రేట్ల ప్రకారం రూ.28 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు అవుతుండగా... దుబాయ్‌లో గరిష్టంగా రూ.25 లక్షలే. దీంతో స్మగ్లర్లకు కనిష్టంగా రూ.3 లక్షల లాభం ఉంటోంది. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేసే ప్రతిపాదనలు ఉన్నాయని, ఈలోపే భారీగా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ముఠాలు చెలరేగుతున్నాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. క్యారియర్లు, రెక్టమ్ కన్సీల్మెంట్... బంగారం అక్రమ రవాణాకు వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ‘బడా బాబులు’ రంగంలోకి దిగారు. కేరళ, ముంబైలతో పాటు సిటీ యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం తరలిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో వీరే క్యారియర్లు. దుబాయ్‌లో అసలు ఆదాయపు పన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నారు. అక్కడ ఎవరైనా, ఎంతైనా బంగారం కొనొచ్చు. విమానంలోకి తీసుకువచ్చేప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదనే ఆధారాలుంటే చాలు. స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, పౌడర్ డబ్బాలతో పాటు మొబైల్ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తరువాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి తాపడం పూసి తీసుకొచ్చారు. తాజాగా తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో శస్త్రచికిత్సలు చేయించి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పెట్టేలా చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. స్మగ్లర్లకు అనేక మంది సహకారం.. కస్టమ్స్ తనిఖీల్లో బంగారం చిక్కకుండా సురక్షితంగా విమానాశ్రయం బయటి వరకు తీసుకువరావడానికి స్మగ్లర్లు అనేక మంది సహకారం తీసుకుంటున్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వారితోనూ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బంగారాన్ని బయటకు రప్పిస్తారు. కొందరు కస్టమ్స్ అధికారులు సైతం ఇదే తరహాలో స్మగ్లర్లకు సహకరిస్తున్న ఆరోపణలున్నాయి.