జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్‌పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఆర్‌జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు.
విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్‌లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు.
ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్‌స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్‌పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్‌రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment