RGIA AIRPORT
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ఏటా ఇచ్చే ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్ టర్మినల్ ఎక్స్పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఆర్జీఐఏ) సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు, సెక్యూరిటీ స్టాఫ్, షాప్స్, ఫుడ్ అండ్ బేవరేజస్ అవుట్లెట్లలో స్టాఫ్ పనితీరు మెరుగ్గావుండటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్పోర్ట్ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్రెక్స్(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. -
హైదరాబాద్-దిల్లీ విమానాలు.. 29 ఆలస్యం.. 13 దారి మళ్లింపు.. కారణం తెలుసా..
హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ కారణంగా రహదారులపై ప్రయాణాలు కొంత కష్టంగా మారాయి. మరోవైపు విమానాశ్రయంలో కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్ముకుంటుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్‌వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. అత్యవసరంగా టేకాఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) ద్వారా ప్రయాణం సాగిస్తున్న పలు విమానాలను దారి మళ్లించారు. గడిచిన రెండురోజుల్లో హైదరాబాద్-దిల్లీ మధ్య ప్రయాణాలు సాగిస్తున్న 29 విమానాల ప్రయాణ సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. జనవరి 14న 14 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 6 విమానాలను ఆర్‌జేఐఏ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. జనవరి 15న 15 విమానాల ప్రయాణం ఆలస్యం అయింది. ఏడు విమానాలను హైదరాబాద్ విమానాశ్రయానికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు, దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక విమానంను సంబంధిత అధికారులు దారి మళ్లించారు. ఇదీ చదవండి: భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - సీఈఓ రానున్న 4-5 రోజుల పాటు నార్త్ ఇండియాలో దట్టమైన పొగమంచు ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దాంతో ఈ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా పూర్తి సమాచారాన్ని ముందుగానే ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
రయ్‌రయ్‌మని.. భాగ్యనగరం నుంచి బోయింగ్ విమానాలు..
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుని భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు సుళువుగా సాగేలా మరింతగా విస్తరించనున్నారు. ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి భారీ విమానాలైన బోయింగ్ సర్వీసులు రయ్‌రయ్‌మంటూ రెగ్యులర్‌గా ఎగరనున్నాయి. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 1.20 మంది ప్రయాణిస్తున్నారు. రోజురోజుకి ఈ ఎయిర్‌పోర్టు ద్వారా రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి. కరోనాకి ముందు 2019లో అయితే ఏకంగా 2.10 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టుని ఉపయోగించుకున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల తరహాలో రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి మరింత రద్దీ పెరగబోతుంది. ఇక్కడి నుంచి అమెరికా, యూరప్లకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాలకు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ఏడాదికి 3.4 కోట్ల మంది ఆకాశయానం సాగించే వీలుంది. దీంతో ఆ స్థాయికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టుని భారీగా విస్తరించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎక్కువగా ఉపయోగించే 93 కోడ్ సీ శ్రేణికి చెందిన బోయింగ్ 737, 700, ఏ 320 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అందులో భాగంగా వెస్టర్న్ అప్రాన్‌లో నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల కోసం కొత్తగా 17 కాంటాక్ట్ స్టాండ్లను 57,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వీటితో పాటు ఒక రిమోట్స్టాండ్ రానుంది. ఇక దేశీ విమానాల కోసం ఈస్టర్న్ అప్రాన్‌లో 25,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 17 కమాండ్స్టాండ్లు, నాలుగు రిమోట్ స్టాండ్లు కొత్తగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ని పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత ఒకేసారి 93 కోడ్ సీ శ్రేణికి చెందిన విమానాలను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే అవకాశం కలుగుతుంది. ఇందులో 44 కాంటాక్ట్ స్టాండ్స్ ఉండగా 49 రిమోట్ స్టాండ్స్ ఉండనున్నాయి. విమానాలు నిలిచే సౌకర్యాలు విస్తరించడంతో పాటు ప్రయాణికులు లగేజ్ సులువుగా తీసుకునేందుకు వీలుగా ఓ టన్నెల్ మార్గం కూడా నిర్మించనున్నారు. అంతేకాదు ర్యాపిడ్ ట్యాక్సి ఎగ్జిట్ మార్గాలను సైతం అందుబాటులోకి తేనున్నారు. -
టేకాఫ్.. మహాస్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులు క్షణాల్లో రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. హైదరాబాద్ నుంచి అనేక జాతీయ, అంతర్జాతీయ నగరాలకు పెరిగిన విమాన సదుపాయాలతో ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ భారతానికి ప్రధాన ముఖద్వారంగా ఉన్న హైదరాబాద్ నుంచి 55 ప్రధాన నగరాలకు నేరుగా ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. మరోవైపు పలు ఎయిర్‌లైన్స్ సంస్థలుచార్జీలపైన ఇస్తున్న రాయితీలు, ఆఫర్లు కూడా ప్రోత్సహిస్తున్నాయి. తరచుగా ఫ్లైట్ చార్జీలు రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ చార్జీలతో సమానంగా ఉంటున్నాయి. దీంతో గంటలతరబడి రైళ్లలో ప్రయాణించడానికి బదులు నగరవాసులు ఫ్లైట్ జర్నీనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 2.13 కోట్ల మంది పయనించగా వారిలో 1.74 కోట్ల మంది డొమెస్టిక్ ప్రయాణికులు. మరో 39 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. గతేడాదితో పోల్చుకుంటే జాతీయ ప్రయాణికుల పెంపుదల 10 శాతం వరకు నమోదు కాగా, అంతర్జాతీయ ప్రయాణికుల పెంపుదల 9 శాతంవరకు నమోదైనట్లు జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు దిల్లీ, ముంబయి, బెంగళూర్, కోల్కత్తా, చెన్నై నగరాలకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లలో కనీసం 12 గంటల నుంచి 16 గంటల పాటు ప్రయాణం చేస్తే తప్ప చేరుకోలేని నగరాలు ఇప్పుడు ఫ్లైట్‌లో కేవలం గంట నుంచి 2 గంటల వ్యవధికి తగ్గడం, నగరవాసుల్లో పెరిగిన కొనుగోలు శక్తి ఇందుకు కారణం. హైదరాబాద్ నుంచి శబరికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు ఇప్పుడు ట్రైన్ జర్నీ కంటే ఫ్లైట్ జర్నీ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కొత్తగా గోరఖ్‌పూర్, గ్వాలియర్, బెల్గాం, మైసూర్, నాసిక్, తిరుచిరాపల్లి తదితర నగరాలకు ఫ్లైట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ప్రధాన అంతర్జాతీయ నగరాలకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉండడంవల్ల ఏటేటా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌కు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు. 71 నగరాలు, 25 ఎయిర్‌లైన్స్... రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో 8 డొమెస్టిక్, 21 ఇంటర్నేషనల్ నగరాలతో ప్రారంభమైన సేవలు ఇప్పుడు 71 నగరాలకు విస్తరించాయి. 25 ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను నడుపుతున్నాయి. రెండో రన్‌వే సైతం అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. మరోవైపు పలు ఆసియా దేశాలకు కేవలం 5 గంటల వ్యవధిలో చేరుకొనే సదుపాయం ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలకు సైతం 2 గంటల్లోపే చేరుకోవచ్చు. ఏటా కొత్త నగరాలకు సర్వీసులు విస్తరిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఇందుకనుగుణంగానే ఎయిర్‌పోర్టును విస్తరిస్తున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఫేషియల్ రికగ్నిషన్, బాడీస్కానింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పద్ధతులు ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చాయి. -
ఎయిర్‌పోర్టులో మరో మైలురాయి
శంషాబాద్:పర్యావరణ హితంగా అడుగులు వేస్తున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు మరో ముందడుగు వేసింది. విమానాశ్రయాన్ని వందశాతం ఎల్ఈడీ వెలుగులతో నింపినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సంస్థ ప్రకటించింది. ఆరునెలల కిందట ఆరవైశాతం ఎల్ఈడీ దీపాలను అమర్చిన జీఎంఆర్ సంస్థ తాజాగా ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్లో ఉన్న సైన్ బోర్డులను సైతం పూర్తి స్థాయిలోకి ఎల్ఈడీ దీపాలను అమర్చింది. ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఫ్లోరోసెంట్ దీపాలు ఉన్న చోట్ల మొత్తం 350 ఎల్ఈడీ దీపాలను అమర్చింది. ఈ దీపాలను కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అమర్చారు. ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న ఈ సైన్ బోర్డులు రాత్రి సమయాలతో పాటు ఉదయం వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతో పాటు వాటిని పార్కింగ్ చేసేందుకు సూచికలుగా ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. వందశాతం ఎల్ఈడీ ఏర్పాటుతో ఎయిర్‌పోర్టులో ఏటా 45 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కర్బన రహితంగా ఉండడంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. పర్యావరణ హితంగా ఎయిర్‌పోర్టు ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకుందని ఈ సందర్భంగా సీఈఓ ఎస్జీకే కిషోర్ అన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టును వందశాతం ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం మరో మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే పగటి సమయాల్లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు
శంషాబాద్ జిల్లా: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు, భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరవిమానయానశాఖ ఉత్వర్వుల మేరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో విజిటర్స్ ని ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆంక్షలు అమలులో ఉంటాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.