
సాక్షి, విజయవాడ: విదేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వలస కార్మికులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని రాష్ట్రానికి తరలించే విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతార్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి వస్తున్న వారందరిని సోంత రాష్ట్రాలతో సంబంధం లేకుండా క్వారంటైన్‌కె తరలించాలిన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని పెర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని ఆయన చెప్పారు. (వలస కార్మికుల రాకతో రాష్ట్రంలో హైఅలర్ట్ )
ఏపీ తరపున శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక రిషెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అయితే పెయిడ్ క్వారంటైన్‌కు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని, దీని వల్ల గల్ఫ్ నుంచి వస్తున్న వలస కార్మికులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీకి చెందిన వారిని విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని, దీనిపై విదేశాంగ అధికారులు కూడా సంప్రదిస్తున్నామని చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే శంషాబాద్‌లోని విమానాశ్రయంలో ఏపీ వారి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామిన ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment