కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. 24 గంటల్లోగా విమానాశ్రయాన్ని పేల్చివేస్తామంటూ ఈ రోజు ఉదయం ఎయిర్పోర్ట్ మేనేజర్కు ఈమెయిల్ వచ్చింది.
ఈ మెయిల్ జర్మనీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో విమనాశ్రయాధికారులు ఫిర్యాదు చేశారు. విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో నిఘాను పెంచి తనిఖీలను ముమ్మరం చేశారు.
కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Published Sun, Mar 6 2016 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM
Advertisement
Advertisement