ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలం
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. రెండు విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఢిల్లీ నుంచి నేపాల్, భువనేశ్వర్ వెళుతున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేశారు.
ప్రయాణికులను కిందకు దించివేసి భద్రతా సిబ్బంది, బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. కాగా ఈ విమానాల్లో నలుగురు ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించి తనీఖీలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.