జైపూర్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు | Jaipur Airport Got Bomb Threat Mail | Sakshi
Sakshi News home page

జైపూర్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. తనిఖీల్లో తేలిందేంటంటే..

Feb 16 2024 7:20 PM | Updated on Feb 16 2024 7:51 PM

Jaipur Airport Got Bomb Threat Mail - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని నగరం జైపూర్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్‌‌ వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పోలీస్‌ ఇన్స్పెక్టర్‌ ధృవీకరించారు. ఎయిర్‌పోర్టు అధికారిక మెయిల్‌కు బెదిరింపు రావడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. 

బెదిరింపు మెయిల్‌ వచ్చిన వెంటనే ఎయిర్‌పోర్టు మొత్తం సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాయని, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. మెయిల్‌ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సైబర్‌సెల్‌ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.  

ఇదీ చదవండి.. కేజ్రీవాల్‌కు గుజరాత్‌ హైకోర్టు షాక్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement