సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సదరు మెయిల్‌లో విమానాశ్రయంలో బాంబు ఉందని హెచ్చరించారు. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాంబు లేదని గుర్తించారు. అనంతరం, సదరు మెయిల్ ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయలకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తెలిసిన విషయమే. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు లేదని తెలిసి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఇలాంటి కాల్స్, మెయిల్స్ పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment