
గురువాయూర్ ఆలయానికి బాంబు బెదిరింపు
గురువాయూర్: ప్రఖ్యాత గురవాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో కేరళ యంత్రాంగం అప్రమత్తమైంది. గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం ఆలయ అధికారులకు ఫోన్ చేసి.. బాంబు పెట్టినట్లు బెదిరించాడు.
ఈ హెచ్చరికతో భీతిల్లిన ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాంబ్ స్క్వాడ్ సహా హుటాహుటిన చేరుకున్న పోలీసు బలగాలు ఆలయం అణువణువూ శోధిచాయి. చివరికి బాంబులేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా, ఆలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆలయాన్ని పేల్చేసేందుకు బాంబు అమర్చినట్లు అగంతకుడు పేర్కొనడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆగంతకుడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడనేదానిపై దర్యాప్తు చేపట్టారు.