Guruvayur sri krishna temple
-
సంప్రదాయ పంచెకట్టు..తామర పూల తులాభారం
-
సంప్రదాయ పంచెకట్టు..తామర పూల తులాభారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో భాగంగా ఈ రోజు ( శనివారం) త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ కేరళ దుస్తులు పంచెకట్టుతో సరికొత్త గెటప్‌లో గురువాయుర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిబంధనలను పాటించిన మోదీ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. శనివారం ఉదయం కొచ్చి చేరుకున్న ప్రధాని, కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్‌కు చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు పూర్వ కుంభంతో దేశ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ 'నెయ్యాభిషేకం' , 'కాలాభాం' వంటి ఇతర ఆలయ ఆచారాలను కూడా పాటించారు. ముఖ్యంగా 111 కిలోల తామర పువ్వులతో తులాభారం సమర్పించారు. తమిళనాడులోని నాగార్కోల్ నుంచి ప్రత్యేకంగా 111 కిలోల తామర పువ్వులు తెప్పించారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండవసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారిగా గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. 2008లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక, గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు మోదీ. కేరళను బీజేపీ దూరంగా ఉంచుతోందన్న విమర్శల నేపథ్యంలో తన తొలి పర్యటనకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం ఒక విశేషం కాగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై తనకు ఎంత ప్రేమ ఉందో కేరళపై కూడా అంతే ప్రేమ ఉందంటూ మోదీ తన ప్రసంగంలో భరోసా ఇవ్వడం మరో విశేషం. -
గురువాయుర్‌లో మోదీ తులాభారం
-
గురువాయుర్‌లో మోదీ తులాభారం
సాక్షి, అమరావతి : సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళలో పర్యటించారు. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో కమలం పూలతో తులాభారం వేయించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు. ఈ మధ్యలో ఆయన మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. (రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక) కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు. -
గాన కోవిదుడు ఏసుదాస్ ఆవేదన
-
గురువాయూర్ ఆలయానికి బాంబు బెదిరింపు
గురువాయూర్: ప్రఖ్యాత గురవాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో కేరళ యంత్రాంగం అప్రమత్తమైంది. గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం ఆలయ అధికారులకు ఫోన్ చేసి.. బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ఈ హెచ్చరికతో భీతిల్లిన ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాంబ్ స్క్వాడ్ సహా హుటాహుటిన చేరుకున్న పోలీసు బలగాలు ఆలయం అణువణువూ శోధిచాయి. చివరికి బాంబులేదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఆలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆలయాన్ని పేల్చేసేందుకు బాంబు అమర్చినట్లు అగంతకుడు పేర్కొనడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆగంతకుడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడనేదానిపై దర్యాప్తు చేపట్టారు.