భారత విమానానికి బాంబు బెదిరింపు.. దించివేత
మస్కట్: విమానాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. మొన్న టర్కీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో బాంబు ఉందని హెచ్చరికలు రావడంతో ఢిల్లీలో ల్యాండింగ్ చేసి తనిఖీలు చేయగా.. తాజాగా భారత్కు చెందిన విమానానికి కూడా అలాంటి బెదిరింపే వచ్చింది.
దీంతో ముంబయి నుంచి దుబాయ్ వెళుతున్న భారత జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యూ 536 విమానాన్ని అనూహ్యంగా మస్కట్లో దించివేశారు. విమానంలో బాంబు ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందులో 54మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా క్షేమంగా బయటపడ్డారు.