
ఆఫీస్‌లో బాంబ్ ఉన్నట్లు అర్ధరాత్రి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆఫీసులో ఏ ప్లేసూ వదలకుండా తనిఖీ చేశారు. కానీ అక్కడ ఏం లేకపోవడంతో ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ సిబ్బంది మమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టారు. చదువుతుంటే... ఇది ఓ యాక్షన్ సినిమాలోని సీన్‌లా ఉంది కదా.
కానీ నిజంగా జరిగింది. చెన్నైలోని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్‌లో ఇదంతా జరగిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఒక కమ్యూనిటీని కించపరిచేలా ఉన్నాయట. అందుకే ఎవరో ఇలా బెదిరింపు కాల్ చేసారట. ఈ సినిమా తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment