ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు | bomb threat to air india flight in kolkatta, passengers stopped | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

Published Tue, Sep 20 2016 11:49 AM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు - Sakshi

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి గువాహటి వెళ్లే ఎయిరిండియా విమానంలో బాంబు ఉందంటూ ఓ ఫోన్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా విమానాశ్రయం మొత్తం అప్రమత్తమైంది. విమానాన్ని టేకాఫ్ తీసుకోకుండా ఆపేసి క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. గువాహటి వెళ్లే విమానంలో బాంబు ఉన్నట్లు ఓ మహిళ ఎయిరిండియా చెకిన్ కౌంటర్ వద్దకు ఫోన్ చేసి తెలిపింది.

దాంతో విమానాన్ని అప్పటికప్పుడు ఆపేసి.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు తక్షణం అక్కడకు చేరుకుని దాన్ని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఆ మహిళ ఎయిరిండియా చెకిన్ కౌంటర్‌కు ఫోన్ చేసింది. 9.30 గంటలకు గువాహటి బయల్దేరాల్సిన విమానంలో బాంబు ఉందని ఆమె తెలిపింది. దాంతో ఆ విమానం ఎక్కాల్సిన మొత్తం 114 మంది ప్రయాణికులను వెంటనే ఆపేశారు. ఎయిర్‌పోర్టులో హై ఎలర్ట్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement