
సాక్షి, చెన్నై: చెన్నై సెంట్రల్, మదురై రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు చేసిన రామనాథపురం వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు రైల్వేస్టేషన్ కంట్రోల్ రూం వాట్సాప్ నెంబరుకు ఒక సమాచారం వచ్చింది. అందులో చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లలో బాంబులు పెట్టామని, మరికొద్ది సేపట్లో పేలనున్నట్లు ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్ల కంట్రోల్ రూంలకు సమాచారం అందించారు.
ఈ రెండు రైల్వేస్టేషన్లలో భద్రతా అధికారులు, బాంబు స్క్వాడ్ నిపుణులు పోలీసు జాగిలాలతో రెండు గంటలపాటు తనిఖీలు జరిపారు. బాంబులేవీ లభించలేదు. విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి రామనాథపురానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దళం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment