Railway junction
-
Russia Ukraine war: లైమాన్.. రష్యా హస్తగతం!
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోంది. మారియుపోల్ అనంతరం డోన్బాస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పెద్ద నగరమైన లైమాన్‌ను తమ దళాలు, వేర్పాటువాదులు హస్తగతం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ శనివారం ప్రకటించారు. ముఖ్యమైన రైల్వే జంక్షన్‌ను సైతం ఆక్రమించినట్లు తెలిపారు. లైమాన్కు విముక్తి కల్పించామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 కంటే ముందు లైమాన్లో 20 వేల జనాభా ఉండేది. యుద్ధం మొదలైన తర్వాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం తరలించింది. ఇక్కడున్న రైల్వే జంక్షన్లో రష్యా దళాలు పాగా వేశాయి. లైమాన్పై పట్టుచిక్కడంతో డోంటెస్క్, లుహాన్స్క్ను స్వాధీనం చేసుకోవడం రష్యాకు మరింత సులభతరం కానుంది. ఈ రెండు ప్రావిన్స్‌లను కలిపి డోన్బాస్‌గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించలేక విఫలమైన రష్యా డోన్బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని నగరాలైన సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో రష్యా వైమానిక దాడుల శనివారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగానే ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. అయినప్పటికీ తమ దేశానికి ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తుందని అన్నారు. 50 ఏళ్ల దాకా రష్యా సైన్యంలో చేరొచ్చు సైన్యంలో కాంట్రాక్టు సైనికుల నియామకాల కోసం వయోపరిమితిని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం.. 50 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు కాంట్రాక్టు జవాన్లుగా రష్యా సైన్యంలో చేరి సేవలందించవచ్చు. పురుషులైతే 65 ఏళ్లు, మహిళలైతే 60 ఏళ్లు వచ్చేదాకా సైన్యంలో పనిచేయొచ్చు. వార్షిక బోర్డర్ గార్డ్స్ దినోత్సవంలో పుతిన్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను అభినందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. తమ దేశంపై ఆంక్షలు ఎత్తివేస్తే ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దని మాక్రాన్, షోల్జ్‌కు సూచించారు. ఆయుధాలు సరఫరా చేస్తే ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పరిమాణాలను ప్రమాదకరంగా మార్చొద్దని చెప్పారు. -
చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై సెంట్రల్, మదురై రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు చేసిన రామనాథపురం వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు రైల్వేస్టేషన్ కంట్రోల్ రూం వాట్సాప్ నెంబరుకు ఒక సమాచారం వచ్చింది. అందులో చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్లలో బాంబులు పెట్టామని, మరికొద్ది సేపట్లో పేలనున్నట్లు ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు చెన్నై సెంట్రల్, మదురై రైల్వేస్టేషన్ల కంట్రోల్ రూంలకు సమాచారం అందించారు. ఈ రెండు రైల్వేస్టేషన్లలో భద్రతా అధికారులు, బాంబు స్క్వాడ్ నిపుణులు పోలీసు జాగిలాలతో రెండు గంటలపాటు తనిఖీలు జరిపారు. బాంబులేవీ లభించలేదు. విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి రామనాథపురానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దళం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: మద్యం మత్తులో వదినను లైంగికంగా వేధించిన మరిది.. -
కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్
-
కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్
డ్రైవర్‌కు స్వల్పగాయాలు గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ సమీపంలోని రైల్ కన్జూమర్ డిపో (ఆర్సీడీ) వద్ద మంగళవారం హైజాక్ (కంకర మిక్సింగ్ మిషన్)ను రైలింజన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేంద్ర స్వల్పంగా గాయపడ్డాడు. హైజాక్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. రైల్వే జంక్షన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో జరుగుతున్న పనులకు కూలీలు కంకర మిక్స్‌ను హైజాక్ వాహనం ద్వారా పంపుతున్నారు. ఇదే సమయంలో గుంటూరు, తిరుపతి ప్యాసింజర్ల రైలింజన్లు ఓరాలింగ్ కోసం డీజిల్‌షెడ్‌కు లూప్లైన్లో వెళ్తున్నాయి. ఈ సమయంలో రెండూ ఢీ కొన్నాయి. రైలింజన్ డ్రైవర్ అహ్మద్‌బాషా అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. రైలింజన్ హైజాక్‌ను ఢీకొన్న వెంటనే ఆ డ్రైవర్ సురేంద్ర కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. -
గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య
గుంతకల్లు : స్థానిక రైల్వే జంక్షన్లో ఓ గుర్తుతెలియని యువకుడ గురువారం అర్ధరాత్రి 6వ నంబర్ ప్లాట్ఫారంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుడి వయస్సు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుని జేబులో ఆధార్‌కార్డు లభించింది. ఇందులో రమణ అనూర్స్వామి అని, ముంబై ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వృద్ధుడి మృతదేహం లభ్యం ఇదిలా ఉండగా ప్లాట్‌పారం 1,2ల మధ్య మరుగుదొడ్ల వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఇతని వయస్సు 65 నుంచి 70 ఏళ్లు ఉంటుందని, రైల్వే జంక్షన్లో యాచనచేసే వ్యక్తిగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
‘తెలంగాణ’లో తీరనున్న కల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన ‘పెద్దపల్లి-ఇందూరు’ రైల్వేలైన్ సకాలంలో పూర్తయితే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు. ఏటా ఎడాపెడా రైల్వే చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయటానికి నిధులు కేటాయించటంలో మాత్రం మీనమేషాలు లెక్కి స్తోంది. మరో ఐదారు నెలలలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆ పనులకు మోక్షం కలుగుతుంద న్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, పుట్ఓవర్, ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన ప్రతిపాదనల సంగతి అటుంచితే, పెద్దపల్లి రైల్వేలైన్ కోసం పార్టీలన్నీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి పనులు ప్రారంభించగానే, పోరాటాన్ని మధ్యలోనే విడిచిపెట్టాయి. వ్యాపార సంఘాలతోపాటు వివిధ వర్గాల ప్రజలు ఐక్యకార్యాచరణ పేరుతో రైల్వే అభివృద్ధికి నిధులు సాధించేంత వరకు పోరాడుతామని ప్రకటించినప్పటికీ ఆచరణలో పెట్టలేకపోయారు. దీనికి తగినట్లుగానే ప్రజాప్రతినిధుల పని తీరుంది. ముందుండి పోరాడాల్సిన ఎంపీలు పట్టింపు లేన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరిపై ఓత్తిడి పెంచాల్సిన ఇతర నేతలు అలసత్వాన్ని ప్రద ర్శిస్తున్నారు. విపక్షాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా ఏటా రైల్వే నిధుల కేటాయింపులలో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది.పెద్దపల్లి-ఇందూరు రైల్వేలైన్ కలగానే మిగిలిపోతోంది. అసలు కథ ఇది పెద్దపల్లి-ఇందూరు రైల్వే లైనుకు 1984లో సర్వే చేసిన అధికారులు పనులు ప్రారంభించటానికే దశాబ్ద కాలం పట్టింది. 1993లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు పనులకు శంకుస్థాపన చేశారు. 178.8 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైన్‌ను పూర్తి చేయడానికి రూ. 417 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఇప్పుడది మూడింతలకు పెరి గింది. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రూ. 354 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నిధులు మోర్తాడ్ వరకు లైన్ వేయడానికే సరిపోయాయి. రూ. 10 కోట్లతో నిర్మించాల్సిన రైల్వే బ్రిడ్జి పనులు నిధులు లేక నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయారు. రెండు దశాబ్దాలుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు సర్వే పూర్త యి దశాబ్దం గడిచినా, ఇప్పటి వరకు నయా పైసా కేటాయించలేదు. సదుపాయాలేవీ? జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఫకీరాబాద్, నవీపేట, డిచ్పల్లి, ఇందల్వాయి, సిర్నాపల్లి, కామారెడ్డి, తలమడ్ల, భిక్కనూరు రైల్వే స్టేషన్లున్నాయి. వీటిలో వసతులు అంతంత మాత్రమే. ఈ స్టేషన్ల నుంచి రోజూ దాదాపు పది వేల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. నిజామాబాద్-మన్మాడ్, విశాఖపట్నం-నిజామాబాద్-షిర్డీ, ఆ దిలాబాద్-తిరుపతి, నిజామాబాద్-కాచిగూడ మధ్య 48 రైళ్లు నడుస్తున్నాయి. నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, రెండు కౌంటర్ల ద్వారానే టికెట్లు ఇవ్వడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు సమయానికి రైలును అందుకోలేకపోతున్నా రు. మరో మూడు కౌంటర్ల ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్లలో మినహాయించి మరెక్కడా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేవు. జాతీ య రహదారితోపాటు జనం, వాహనాలు రద్దీగా నడిచే ప్రాంతాలలో ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాల్సిన అవసరముం ది. నిజామాబాద్ సమీపంలోని మాధవనగర్ (ధర్మారం) రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నా రు. ఇది జాతీయ రహదారి కావటం, అధిక ట్రాఫిక్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. నవీపేట, డిచ్పల్లి, కామారెడ్డి (రాజంపేట) రైల్వేగేట్ల వద్ద కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నారు.