అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ సమీపంలోని రైల్ కన్జూమర్ డిపో (ఆర్‌సీడీ) వద్ద మంగళవారం హైజాక్ (కంకర మిక్సింగ్ మిషన్)ను రైలింజన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేంద్ర స్వల్పంగా గాయపడ్డాడు. హైజాక్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. రైల్వే జంక్షన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో జరుగుతున్న పనులకు కూలీలు కంకర మిక్స్‌ను హైజాక్ వాహనం ద్వారా పంపుతున్నారు.