tirupati passenger
-
మొరాయించిన తిరుపతి ప్యాసింజర్
గుంతకల్లు : గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్ రైలు (57476) గూళపాళ్యం రైల్వేస్టేషన్లో మొరాయించింది. దీంతో సుమారు 2 గంటలు ఆలస్యంగా నడిచింది. వివరాలు.. ఉదయం 7.15 గంటలకు గుంతకల్లు నుంచి బయలుదేరిన రైలు గూళపాళ్యం రైల్వేస్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రైలు ఆగినట్టు అధికారులు తెలిపారు. అయితే గుంతకల్లు నుంచి మరో ఇంజన్ పంపి రైలుకు అటాచ్ చేయగా 9.30 గంటలకు రైలు కదిలింది. -
నిలిచిపోయిన తిరుపతి ప్యాసింజర్
అనంతపురం: ఇంజన్లో సాంకేతిక లోపంతో గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్ రైలు గూళ్లపాళెం గ్రామం వద్ద నిలిచిపోయింది. శనివారం ఉదయం గుంతకల్లులో బయలుదేరిన ప్యాసింజర్ రైలు గూళ్లపాళెం గ్రామం వద్దకు రాగానే ఆగిపోయింది. రైలు గంటన్నరపాటు ఆగిపోయినా ఇంకా సాంకేతిక లోపాన్ని సరిచేయకపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంతకల్లు రైల్వే అధికారులు టెక్నికల్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. -
తిరుపతి ప్యాసింజర్ కదిరిదేవరపల్లి వరకు పొడగింపు
రాయదుర్గంటౌన్ : తిరుపతి నుంచి రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం వరకు నడుస్తున్న తిరుపతి ప్యాసింజర్ (57477/57478) రైలును గురువారం నుంచి కదిరిదేవరపల్లి వరకు పొడిగించారు. ఈ మేరకు రైలు రాకపోకల వేళలకు సంబంధించి రైల్వే అధికారులు షెడ్యూల్ మార్పులు చేసి శుక్రవారం రైలును కదిరిదేవరపల్లి వరకు నడిపారు. రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం నుంచి 23 కిలోమీటర్ల పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు రైలును లైను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం కళ్యాణదుర్గం వరకు ఉన్న తిరుపతి ప్యాసింజర్ ఇక మీదుగా కదిరిదేవరపల్లి వరకు నడుస్తుంది. ఈ మేరకు తిరుపతి–కదిరిదేవరపల్లి (ట్రైన్నెంబర్ 57477) ప్యాసింజర్ రైలు ప్రతిరోజు తిరుపతిలో రాత్రి 10.30 గంటలకు బయలు దేరి గుంతకల్లు, బళ్లారి మీదుగా రాయదుర్గంకు ఉదయం 11.50 చేరుకుని ఉదయం 11.52కు కదరిదేవరపల్లికి మధ్యాహ్నం 1.05కు చేరుకుంటుంది. తిరిగి అక్కడ కదిరిదేవరపల్లి–తిరుపతి ప్యాసింజర్(57478) రైలు కదిరిదేవరపల్లిలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరి కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గంకు మధ్యాహ్నం 2.36 గంటలకు చేరుకుని 2.38 గంటలకు బళ్లారి, గుంతకల్లు మీదుగా తిరుపతికి ఉదయం 6.20 గంటలకు చేరుకుంటుంది. -
కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్
-
కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్
డ్రైవర్‌కు స్వల్పగాయాలు గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ సమీపంలోని రైల్ కన్జూమర్ డిపో (ఆర్సీడీ) వద్ద మంగళవారం హైజాక్ (కంకర మిక్సింగ్ మిషన్)ను రైలింజన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురేంద్ర స్వల్పంగా గాయపడ్డాడు. హైజాక్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. రైల్వే జంక్షన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో జరుగుతున్న పనులకు కూలీలు కంకర మిక్స్‌ను హైజాక్ వాహనం ద్వారా పంపుతున్నారు. ఇదే సమయంలో గుంటూరు, తిరుపతి ప్యాసింజర్ల రైలింజన్లు ఓరాలింగ్ కోసం డీజిల్‌షెడ్‌కు లూప్లైన్లో వెళ్తున్నాయి. ఈ సమయంలో రెండూ ఢీ కొన్నాయి. రైలింజన్ డ్రైవర్ అహ్మద్‌బాషా అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. రైలింజన్ హైజాక్‌ను ఢీకొన్న వెంటనే ఆ డ్రైవర్ సురేంద్ర కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.