సాంకేతిక లోపంతో గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్ రైలు గూళ‍్లపాళెం గ్రామం వద‍్ద నిలిచిపోయింది
అనంతపురం: ఇంజన్‌లో సాంకేతిక లోపంతో గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్ రైలు గూళ‍్లపాళెం గ్రామం వద‍్ద నిలిచిపోయింది. శనివారం ఉదయం గుంతకల్లులో బయలుదేరిన ప్యాసింజర్ రైలు గూళ‍్లపాళెం గ్రామం వద‍్దకు రాగానే ఆగిపోయింది. రైలు గంటన‍్నరపాటు ఆగిపోయినా ఇంకా సాంకేతిక లోపాన్ని సరిచేయకపోవడంతో ఈ మార‍్గంలో రైళ‍్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుంతకల్లు రైల‍్వే అధికారులు టెక్నికల్ సిబ‍్బందిని సంఘటన స‍్థలానికి పంపించారు.