ఈ–పంట నమోదుకు సర్వర్‌ కష్టాలు! | Server problems for e crop registration | Sakshi
Sakshi News home page

ఈ–పంట నమోదుకు సర్వర్‌ కష్టాలు!

Published Thu, Aug 29 2024 5:36 AM | Last Updated on Thu, Aug 29 2024 5:36 AM

Server problems for e crop registration

సాంకేతిక సమస్యలతో క్షేత్రస్థాయి సిబ్బంది సతమతం 

ఆర్బీకే పరిధిలో రోజుకు 30–40 ఎకరాలకు మించి నమోదు కాని పరిస్థితి 

రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటున్న ఉన్నతాధికారులు  

తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న  సిబ్బంది

సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదుకు సర్వర్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడం, యాప్‌ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలకు తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పంట నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. 

దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ పంట నమోదు నత్తనడకన సాగుతున్నది. గడిచిన నెల రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే పూర్తయింది. మరొక వైపు ఏది ఏమైనా సెపె్టంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

సర్వర్లు పనిచేయక..ఫొటోలు అప్లోడ్‌ కాక.. 
రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూముల వివరాలను మండల వ్యవసాయాధికారులు సర్వే నంబర్ల వారీగా ఈ–పంట వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేశారు. తొలుత  గ్రామాల సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్బీకే రైతులు సాగు చేసే పంట వివరాలను ఈ–పంట వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఈ ప్రొసీజర్‌ మొత్తం కంప్యూటర్లో మాత్రమే చేయాలి. గతంలో మాదిరిగా మొబైల్‌లో నమోదుకు అవకాశం ఇవ్వలేదు. 

మార్పులు, చేర్పులు చేయాలంటే పొలాల నుంచి మళ్లీ ఆఫీసుకు వచ్చి ఎడిట్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రెండో దశలో మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌లలో ఈ–పంట అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని రిజి్రస్టేషన్‌ చేసుకుని ఈ–పంట వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న వివరాల ఆధారంగా రైతు పొలం వద్దకు వెళ్లి జియో కో–ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోలు తీసి అప్లోడ్‌ చేయాలి. నెట్‌వర్క్‌ సమస్యల వల్ల పంట ఫొటోలు తీసుకోవడం లేదు. 

రోజుకు 10 కిలోమీటర్లకు పైగా.. 
200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాలకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ రోజుకు 10 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో దశలో అప్లోడ్‌ చేసిన పంట వివరాలు, ఫొటోలను తొలుత వీఏఏలు,ఆ తర్వాత వీఆర్వోలు, చివరగా రైతులు అథంటికేషన్‌ (ఈ కేవైసీ) చేయాలి. కొన్ని జిల్లాలకు మాత్రమే సర్వర్లు ఇవ్వడం, ఆ సర్వర్లు కాస్తా సరిగా పనిచేయకపోవడంతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్నది.  

రోజుకు వంద ఎకరాలు చేయాలంటూ ఒత్తిడి! 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలకు సంబంధించి 1,34,48,611 ఎకరాలు సాగవగా, వీఏఏలు 59,27,115 ఎకరాల వివరాలను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు  31 శాతం మాత్రమే ఈ–పంట నమోదు పూర్తయింది. వెబ్‌సైట్, యాప్, సర్వర్లు మొరాయిస్తుండడంతో రోజుకు ఆర్బీకే పరిధిలో 30–40 ఎకరాలకు మించి ఈ–పంట నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

జియో కో– ఆర్డినేట్స్‌ పరిధిని పెంచాలి.
రాష్ట్రంలో ఈ–క్రాప్‌ నమోదు సజావుగా సాగడం లేదు. సర్వర్‌ సరిగా పనిచేయక, యాప్‌ సకాలంలో ఓపెన్‌ కాక నమోదులో జాప్యం జరుగుతోంది.  నిర్ణీత గడువులోగా పూర్తికాకపోతే పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ, సంక్షేమ ఫలాలు పొందడంలో రైతులు నష్టపోతారు. 

విత్తనాల పంపిణీలో మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లను ఏ విధంగా సహాయకులుగా నియమించారో అదేరీతిలో ఈ–పంట నమోదులో వీఏఏలకు సహాయకులుగా వీఆర్వోలు, విలేజ్‌ సర్వేయర్లను నియమించాలి. జియో ఫెన్సింగ్‌ మాగా­ణిలో 500 మీటర్లు మెట్టలో 250 మీటర్లకు పెంచాలి.      – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement