కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్‌ | Train engine collision Gravel machine | Sakshi
Sakshi News home page

కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్‌

Published Wed, Dec 28 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్‌

కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్‌

డ్రైవర్‌కు స్వల్పగాయాలు

గుంతకల్లు:  అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌ సమీపంలోని రైల్‌ కన్జూమర్‌ డిపో (ఆర్‌సీడీ) వద్ద మంగళవారం హైజాక్‌ (కంకర మిక్సింగ్‌ మిషన్‌)ను రైలింజన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సురేంద్ర స్వల్పంగా గాయపడ్డాడు. హైజాక్‌ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.  రైల్వే జంక్షన్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంలో జరుగుతున్న పనులకు కూలీలు కంకర మిక్స్‌ను హైజాక్‌ వాహనం ద్వారా పంపుతున్నారు.

ఇదే సమయంలో గుంటూరు, తిరుపతి ప్యాసింజర్‌ల రైలింజన్లు  ఓరాలింగ్‌ కోసం డీజిల్‌షెడ్‌కు లూప్‌లైన్‌లో వెళ్తున్నాయి. ఈ సమయంలో రెండూ ఢీ కొన్నాయి. రైలింజన్‌ డ్రైవర్‌ అహ్మద్‌బాషా అప్రమత్తమై బ్రేక్‌ వేయడంతో  ప్రమాదం తప్పింది. రైలింజన్‌ హైజాక్‌ను ఢీకొన్న వెంటనే ఆ డ్రైవర్‌ సురేంద్ర కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement