సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన ‘పెద్దపల్లి-ఇందూరు’ రైల్వేలైన్ సకాలంలో పూర్తయితే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు. ఏటా ఎడాపెడా రైల్వే చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయటానికి నిధులు కేటాయించటంలో మాత్రం మీనమేషాలు లెక్కి స్తోంది. మరో ఐదారు నెలలలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆ పనులకు మోక్షం కలుగుతుంద న్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, పుట్‌ఓవర్, ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన ప్రతిపాదనల సంగతి అటుంచితే, పెద్దపల్లి రైల్వేలైన్ కోసం పార్టీలన్నీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.
ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి పనులు ప్రారంభించగానే, పోరాటాన్ని మధ్యలోనే విడిచిపెట్టాయి. వ్యాపార సంఘాలతోపాటు వివిధ వర్గాల ప్రజలు ఐక్యకార్యాచరణ పేరుతో రైల్వే అభివృద్ధికి నిధులు సాధించేంత వరకు పోరాడుతామని ప్రకటించినప్పటికీ ఆచరణలో పెట్టలేకపోయారు. దీనికి తగినట్లుగానే ప్రజాప్రతినిధుల పని తీరుంది. ముందుండి పోరాడాల్సిన ఎంపీలు పట్టింపు లేన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరిపై ఓత్తిడి పెంచాల్సిన ఇతర నేతలు అలసత్వాన్ని ప్రద ర్శిస్తున్నారు. విపక్షాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా ఏటా రైల్వే నిధుల కేటాయింపులలో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది.పెద్దపల్లి-ఇందూరు రైల్వేలైన్ కలగానే మిగిలిపోతోంది.
అసలు కథ ఇది
పెద్దపల్లి-ఇందూరు రైల్వే లైనుకు 1984లో సర్వే చేసిన అధికారులు పనులు ప్రారంభించటానికే దశాబ్ద కాలం పట్టింది. 1993లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు పనులకు శంకుస్థాపన చేశారు. 178.8 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైన్‌ను పూర్తి చేయడానికి రూ. 417 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఇప్పుడది మూడింతలకు పెరి గింది. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రూ. 354 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నిధులు మోర్తాడ్ వరకు లైన్ వేయడానికే సరిపోయాయి. రూ. 10 కోట్లతో నిర్మించాల్సిన రైల్వే బ్రిడ్జి పనులు నిధులు లేక నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయారు. రెండు దశాబ్దాలుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు సర్వే పూర్త యి దశాబ్దం గడిచినా, ఇప్పటి వరకు నయా పైసా కేటాయించలేదు.
సదుపాయాలేవీ?
జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఫకీరాబాద్, నవీపేట, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, సిర్నాపల్లి, కామారెడ్డి, తలమడ్ల, భిక్కనూరు రైల్వే స్టేషన్లున్నాయి. వీటిలో వసతులు అంతంత మాత్రమే. ఈ స్టేషన్ల నుంచి రోజూ దాదాపు పది వేల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. నిజామాబాద్-మన్మాడ్, విశాఖపట్నం-నిజామాబాద్-షిర్డీ, ఆ దిలాబాద్-తిరుపతి, నిజామాబాద్-కాచిగూడ మధ్య 48 రైళ్లు నడుస్తున్నాయి. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, రెండు కౌంటర్ల ద్వారానే టికెట్లు ఇవ్వడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు సమయానికి రైలును అందుకోలేకపోతున్నా రు. మరో మూడు కౌంటర్ల ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్లలో మినహాయించి మరెక్కడా ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు లేవు. జాతీ య రహదారితోపాటు జనం, వాహనాలు రద్దీగా నడిచే ప్రాంతాలలో ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాల్సిన అవసరముం ది. నిజామాబాద్ సమీపంలోని మాధవనగర్ (ధర్మారం) రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నా రు. ఇది జాతీయ రహదారి కావటం, అధిక ట్రాఫిక్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. నవీపేట, డిచ్‌పల్లి, కామారెడ్డి (రాజంపేట) రైల్వేగేట్ల వద్ద కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నారు.
‘తెలంగాణ’లో తీరనున్న కల
Published Mon, Nov 25 2013 6:33 AM | Last Updated on Sat, Jul 6 2019 3:56 PM
Advertisement