
పెద్దపల్లి, సాక్షి: పెద్దపల్లి పట్టణ శివారులోని రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన కుక్క పద్మను స్థానికులు.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయ నగర్‌కు చెందిన కుక్క అమృత, కుక్క భాగ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.