
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.
దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్‌లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు.
కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment