దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరోసారి ఉగ్రవాదులు దాడి తలపెట్టారా?
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరోసారి ఉగ్రవాదులు దాడి తలపెట్టారా? పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ ఇదే మాట చెబుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని తాజ్ హోటల్తో పాటు స్వదేశీ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబు పేలుళ్ల గురించి చర్చించుకుంటుండగా తాను విన్నానంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ముంబై మహానగరం మొత్తం అప్రమత్తమైంది.
తాజ్ హోటల్తో పాటు విమానాశ్రయాలలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను మోహరించి, హై సెక్యూరిటీ ఎలర్ట్ ప్రకటించారు. మూడు ప్రాంతాల్లోనూ భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయం ఇంతవరకు తెలియలేదు. అతడు మంగళవారం ఉదయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా మూడు ప్రదేశాలలోను బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను దించారు.