mumbai airports
-
ఐదు గంటలపాటు విమానంలోనే..
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు. నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు. -
ముంబై విమానాశ్రయంలో ఉద్విగ్న వాతావరణం (ఫోటోలు)
-
అదానీ గ్రూప్ పునర్వ్యవస్థీకరణ
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్ బిజినెస్‌లలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ముంబై ఎయిర్‌పోర్ట్స్ సీఈవో ఆర్కే జైన్‌ను ఎయిర్‌పోర్ట్స్ సీఈవోగా ఎంపిక చేసింది. నాన్‌ఏరో బిజినెస్ అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్ఎల్)కు బెన్ జండీని సీఈవోగా నియమించింది. గత వారం ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) మేనేజ్మెంట్ను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధ సంస్థ అయిన ఏఏహెచ్ఎల్ సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏఏహెచ్ఎల్ ప్రెసిడెంట్ ప్రకాష్ తుల్సియానీ ఎంఐఏఎల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అహ్మదాబాద్ నుంచి ముంబైకు మారుస్తోంది. త్వరలో ప్రారంభంకానున్న నవీ ముంబై ఎయిర్‌పోర్టులో ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. గతేడాది ఆగస్ట్‌లో జీవీకే గ్రూప్‌నకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గల వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అదానీ గ్రూప్ 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్) జీవీకే గ్రూప్ తన వాటాను పెంచుకుంది. ఎంఐఏఎల్‌లో తమ అనుబంధ కంపెనీ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 10 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల షేర్లను రూ.924 కోట్లు వెచ్చించి ఏసీఎస్ఏ గ్లోబల్ నుంచి దక్కించుకున్నట్టు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శుక్రవారం తెలిపింది. ఇటీవల బిడ్వెస్ట్ నుంచి కొనుగోలు చేసిన 13.5 శాతం వాటాతో కలిపి ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్ వాటా తాజా డీల్‌తో 50.5 శాతం నుంచి 74 శాతానికి ఎగసింది. -
ముంబై విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరోసారి ఉగ్రవాదులు దాడి తలపెట్టారా? పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ ఇదే మాట చెబుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని తాజ్ హోటల్‌తో పాటు స్వదేశీ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబు పేలుళ్ల గురించి చర్చించుకుంటుండగా తాను విన్నానంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ముంబై మహానగరం మొత్తం అప్రమత్తమైంది. తాజ్ హోటల్‌తో పాటు విమానాశ్రయాలలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను మోహరించి, హై సెక్యూరిటీ ఎలర్ట్ ప్రకటించారు. మూడు ప్రాంతాల్లోనూ భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయం ఇంతవరకు తెలియలేదు. అతడు మంగళవారం ఉదయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా మూడు ప్రదేశాలలోను బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను దించారు.