
ఆగ్రా : ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పర్యాటకులను అక్కడినుంచి ఖాళీ చేయించి తాజామహల్‌ను మూసివేశారు. తాజామహల్‌లో బాంబు పెట్టినట్లు గురువారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్‌ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన దుండగులు..తాజ్ మహల్‌లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని తెలిపాడు. దీంతో వెంటనే దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే తాజ్‌మహల్ లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని ఆగ్రా ఐజీ సతీష్ గణేష్ ధృవీకరించారు. ఇది ఫేక్ కాల్ అని పేర్కొన్నారు.
చదవండి : (రాజకీయాలకు చిన్నమ్మ గుడ్‌బై..రాజీకి షా ప్రయత్నాలు)
(గడ్డు పరిస్థితుల్లో యడ్డి సర్కార్: అసెంబ్లీలో అగ్నిపరీక్ష )
Bomb Disposal Squad & other teams carried out extensive search at Taj Mahal premises. No such object has been found yet. Man who called up to give info (of bomb) will soon be traced. I'd like to assure you that there's 99% chances of it being hoax call: A Satish Ganesh, IG Agra pic.twitter.com/MfkmwBrBoA
— ANI UP (@ANINewsUP) March 4, 2021
Comments
Please login to add a commentAdd a comment