బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే! | turkish plane declared safe after lipstick threat over bomb | Sakshi
Sakshi News home page

బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే!

Published Tue, Jul 7 2015 7:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే!

బాంబు లేదు... అదంతా ఉత్తి బెదిరింపే!

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన టర్కీ విమానంలో బాంబు లేదని, విమానం బాత్రూంలో రాసినది ఉత్తుత్తి బెదిరింపేనని తేలిపోయింది.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన టర్కీ విమానంలో బాంబు లేదని, విమానం బాత్రూంలో రాసినది ఉత్తుత్తి బెదిరింపేనని తేలిపోయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న విమానంలో ఉన్న మొత్తం 148 మంది ప్రయాణికులను దించేసి, విమానాన్ని ఆరు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

చివరకు ఆ విమానంలో బాంబు గానీ, మరెలాంటి పేలుడు పదార్థాలు గానీ లేవని తేల్చారు. దాంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు.. విమానం బాత్రూంలోని అద్దం మీద లిప్స్టిక్తో ఎవరో.. 'కార్గో విభాగంలో బాంబు ఉంది జాగ్రత్త' అని రాశారు. దాన్ని చూసినవాళ్లు పైలట్కు విషయం చెప్పడంతో అత్యవసరంగా విమానాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement