
బాంబు ఉందని.. విమానంలోంచి దూకేశారు!
వాళ్లంతా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఆల్బరీ నగరానికి వెళ్లడానికి విమానం ఎక్కారు.
వాళ్లంతా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఆల్బరీ నగరానికి వెళ్లడానికి విమానం ఎక్కారు. వాళ్ల విమానం ఇంకా టేకాఫ్ తీసుకోకముందే ఉన్నట్టుండి ఒక ప్రకటన వినిపించింది. విమానంలో బాంబు ఉన్నట్లు తెలిసిందని, అందువల్ల లగేజి ఎక్కడిదక్కడే వదిలేసి వెంటనే బయటకు పరుగెత్తాలని ఆ ఎనౌన్స్‌మెంట్‌లో తెలిపారు. విమానంలో బాంబు ఉందంటూ బాత్రూంలో ఒక నోట్ కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని ఆ విషయాన్ని బయటకు తెలిపారు.
అంతే, మొత్తం విమానంలో ఉన్న 42 మంది ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు దూకేశారు. ఆ తర్వాత పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసుల వాళ్లు, బాంబు నిర్వీర్యదళం అంతా వచ్చి విమానం మొత్తం గాలించారు గానీ అక్కడ వాళ్లకు ఏమీ కనిపించలేదని ద ట్రిబ్యూన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తన కథనంలో తెలిపింది. బాత్రూంలో నోట్ అంటించినట్లుగా భావిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.