జనం సొమ్ముతో జల్సాలు.. పాలన గాలికి
జనం సొమ్ముతో జల్సాలు.. పాలన గాలికి
Published Sat, Aug 27 2016 8:17 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ
రాష్ట్ర నేత ఉదయభాను ధ్వజం
– పుష్కరాల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
వత్సవాయి :
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు జల్సాలు చేస్తూ పాలనను గాలికి వదిలేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. శనివారం వత్సవాయిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేస్తున్న దుబారా ఖర్చులకు అంతం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని చెబుతూనే పుష్కర ముగింపునకు విదేశాల నుంచి బాణాసంచా తెచ్చి కాల్పడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారన్నారు. మొత్తం మీద పుష్కరాలకు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెబుతున్న ప్రభుత్వం కేవలం రూ. 500 నుంచి 600 కోట్ల మేరకే ఖర్చు పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారని మిగతా నిధులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారపిచ్చిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో పేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంజం కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు.
Advertisement