ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్‌లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్‌తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.
అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment