ఉజ్బెకిస్తాన్‌లో 250 మంది రాష్ట్రవాసుల నిర్భంధం | 250 people forced to Uzbekistan state residents | Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్తాన్‌లో 250 మంది రాష్ట్రవాసుల నిర్భంధం

Aug 13 2014 3:42 AM | Updated on Sep 2 2017 11:47 AM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 250 మంది కూలీలు కొంతకాలంగా ఉజ్బెకిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నారు. వేతనాలు ఇవ్వడం లేదు సరికదా..

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 250 మంది కూలీలు కొంతకాలంగా ఉజ్బెకిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నారు. వేతనాలు ఇవ్వడం లేదు సరికదా.. మంచినీళ్లు, తినడానికి ఆహారం కూడా సరిగా పెట్టకుండా చీకటి గదిలో ఉంచుతూ వారు పనిచేస్తున్న సంస్థ యూజమాన్యం నరకం చవి చూపిస్తోంది. ఈ విధంగా నిర్బంధంలో ఉన్న విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ అనే కార్మికుడు అక్కడినుంచి తప్పించుకొని ఉజ్బెకిస్తాన్‌లో తాము పడుతున్న బాధలను సమాచార పౌరసంబంధాలు, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేసి చెప్పడంతో వివరాలు వెలుగు చూశారుు.
 
వెంటనే స్పందించిన మంత్రి.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్ చేసి కార్మికుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు.  వివరాలను మంత్రి పల్లె మంగళవారం సచివాలయంలో విలేకరులకు వెల్లడిం చారు. ప్రభుత్వ ఖర్చులతో వారిని ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తామని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కూలీలను మోసం చేసిన ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఎస్పీకి, సీఐడీ అధికారులకు లేఖలు రాసినట్లు తెలిపారు. విదేశాల్లో ఇబ్బం దుల్లో వున్న వారి సమాచారం, ఫిర్యాదుల కోసం హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ (9949054467)ను సంప్రదించవచ్చని పల్లె వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement