మోదీకి పుస్తకాన్ని బహూకరిస్తున్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్
న్యూఢిల్లీ: భారత్–ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకఘట్టం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ రక్షణ, వైద్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ సహా 17 కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రసుత్తం భారత పర్యటనలో ఉన్న మిర్జియోయెవ్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే రక్షణ, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ
సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మేం పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. దీర్ఘకాల ప్రయోజ నాల దృష్ట్యా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. శాంతియుత, ప్రజాస్వామ్య, సుసంపన్న అఫ్గానిస్తాన్‌తోనే అందరికీ లాభం కలుగుతుంది’ అని ఈ విషయంలో సహకరించుకోవాలని భారత్, ఉజ్బెకిస్తాన్‌లో ఓ అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment