ఫెడ్ కప్‌లో భారత్ బోణీ | Image for the news result Fed Cup: Ankita Raina shines as India defeat Uzbekistan | Sakshi
Sakshi News home page

ఫెడ్ కప్‌లో భారత్ బోణీ

Published Sat, Feb 6 2016 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

Image for the news result Fed Cup: Ankita Raina shines as India defeat Uzbekistan

హువా హిన్ (థాయ్‌లాండ్): రెండు వరుస పరాజయాల తర్వాత ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జట్టు బోణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఉజ్బెకిస్తాన్‌పై నెగ్గింది. అంకిత రైనా సింగిల్స్, డబుల్స్‌లో గెలవడం టీమిండియాకు కలిసొచ్చింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 6-1, 6-1తో సబీనా షరిపోవాపై; రెండో సింగిల్స్‌లో అంకిత 6-1, 6-0తో నిజినా అబ్డురామివాపై గెలిచారు. డబుల్స్‌లో అంకిత-సానియా 6-2, 6-0తో అగుల్ అమన్‌మురదోవా-అరినా ఫోల్ట్స్‌పై గెలవడంతో భారత్ విజయం పరిపూర్ణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement