
ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు భారత చెస్ క్రీడాకారులు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఉజ్బెకిస్తాన్‌లోప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 18 మంది, మహిళల విభాగంలో 11 మంది బరిలోకి దిగుతున్నారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిల నుంచి పతకాలు ఆశించవచ్చు.