వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా.. | A Mysterious Kazakhstan Kalachi Village People Falling Asleep For Days | Sakshi
Sakshi News home page

వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా..

Published Thu, Mar 14 2024 2:23 PM | Last Updated on Thu, Mar 14 2024 6:22 PM

A Mysterious Kazakhstan Kalachi Village People Falling Asleep For Days   - Sakshi

నిద్ర అనేది మని షి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలా అతిగా నిద్రపోయినా ప్రమాదమే. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, దైనందిన జీవితానికి ఆటంకంగానే ఉంటుంది. అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది. వారికి నిద్ర ఏదోమైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడపడితే అక్కడే మత్తుగా నిద్రపోతారట. పైగా చాలా రోజుల వరకు లేవరట. ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట. చెప్పాలంటే మన రామాయణ ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు. ఆ వింత గ్రామం ఎక్కడుందంటే..

కజకిస్తాన్లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెల పాటు నిద్రపోతాడు. ఇలా నిద్ర పోయిన వ్యక్తి మళ్లీ నెల పాటు మేల్కోడట. అందుకే ఈ ఊరును "స్లీపీ హోల్" అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు.

ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం బాధకరం. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా  ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది.

దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీత కలాచి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. 

(చదవండి: రిజర్వాయర్‌ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement