అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య | Visakhapatnam Young Woman Molested In Kazakhstan - Sakshi
Sakshi News home page

అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య

Published Thu, Mar 21 2024 7:01 AM | Last Updated on Thu, Mar 21 2024 1:23 PM

Visakha woman molested in zakistan - Sakshi

కజకిస్తాన్‌లో విశాఖ యువతికి వేధింపులు 


 భారత్‌కు వెళ్లిపోతానన్నా పాస్ట్‌పోర్ట్‌ ఇవ్వకుండా ముప్పుతిప్పలు 


 ఫీజు మొత్తం చెల్లిస్తేనే పంపిస్తామంటూ కన్సల్టెన్సీ బెదిరింపులు 


 గాజువాక పోలీసులను ఆశ్రయించిన విద్యార్థిని తండ్రి 

విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్‌లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్‌లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్‌పోర్ట్‌ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. 

అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్‌ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్‌కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్‌కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు.

 కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్‌కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్‌కు కొంత మంది సీనియర్‌ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్‌ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్‌ చేసి వేరే హాస్టల్‌కు మార్పించినట్లు చెప్పింది. 

డబ్బు చెల్లిస్తేనే పాస్‌పోర్ట్‌ ఇస్తామంటూ.. 
అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్‌పోర్ట్‌ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్‌లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్‌ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement