కజకిస్థాన్‌లో కూలిన విమానం.. 42 మంది మృతి | Plane Crashes Near Aktau City In Kazakhstan | Sakshi
Sakshi News home page

కజకిస్థాన్‌లో కూలిన విమానం.. 42 మంది మృతి

Published Wed, Dec 25 2024 1:08 PM | Last Updated on Wed, Dec 25 2024 4:23 PM

Plane Crashes Near Aktau City In Kazakhstan

అజర్‌బైజాన్‌: కజకిస్థాన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. 67 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో 42 మంది మరణించినట్లు కజకిస్థాన్‌ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.  ఈ ఘటనలో 11 ఏళ్ల బాలికతో సహా 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాల ప్రకారం.. కజకిస్థాన్‌లోని అక్తౌ నగరానికి సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం(J2-8243) బాకూ నుంచి రష్యా వెళ్లున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురికాక ముందు విమానం విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు సమాచారం.

అక్తౌ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. విమానం భూమి ఢీకొనడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. విమాన ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  ఘటన స్థలంలో 52 ఫైర్‌ టెండర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.  

మరోవైపు.. ప్రయాణికుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాదానికి ముందు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం పైలట్‌.. ఏటీసీకి రిక్వెస్ట్‌ పంపినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement