
చల్లని సాయంకాలం ఓ మాదిరిగా పడుతోన్న వర్షం చినుకులు చూస్తు టీ తాగితే ఆ అనుభూతే వేరు. పొగలు గక్కే టీని సిప్ చేస్తూ క్రిస్పీగా, కారకారంగా ఉండే వేడివేడి స్నాక్స్ మరింత ఆనందాన్ని ఇస్తాయి. పకోడీ, బజ్జీ,సమోసాలు ఎప్పుడూ తినేవే కాబట్టి ఈసారి వంటిల్లు చెబుతోన్న స్నాక్స్‌తో టీని సిప్ చేసి చూడండి.
సూజీ టోస్ట్ తయారీకి కావలసినవి:
బ్రెడ్ స్లైస్‌లు – ఆరు, సూజీ రవ్వ – అరకప్పు; పెరుగు – పావు కప్పు;
క్యారట్ తురుము – టేబుల్ స్పూను; ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు;
టొమాటో తరుగు – టేబుల్ స్పూను; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను;
కారం – టీస్పూను; బటర్ – టోస్టు వేయించడానికి సరిపడా; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానమిలా:
బ్రెడ్ స్లైలు తప్పించి మిగతా పదార్థాలన్నింటిని గిన్నెలో వేసి కలపాలి.
రుచికి సరిపడా ఉప్పు, కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ చిక్కగా కలపాలి.
కలిపిన మిశ్రమాన్ని బ్రెడ్ స్లైస్‌మీద మందంగా పరుచుకోవాలి.
ఇలా స్లైసులన్నింటికి రాశాక, నాన్‌స్టిక్ పాన్‌పై బటర్ వేసి రెండు వైపులా చక్కగా కాల్చాలి.
టోస్టు బంగారు వర్ణంలో, క్రిస్పీగా మారేంత వరకు కాల్చి తీసేయాలి.