చెర్రీ – చాక్లెట్ బాల్స్ తయారీకి కావల్సినవి:
చెర్రీలు – 3 కప్పులు (గింజలు తీసి, శుభ్రం చేసి, గుజ్జులా చేసుకోవాలి), చాక్లెట్ చిప్స్ – అర కప్పు (ఓవెన్‌లో క్రీమ్‌లా మెల్ట్ చేసుకోవాలి)
వాల్ నట్స్ – 1 కప్పు (మెత్తగా పౌడర్ చేసుకోవాలి)
జీడిపప్పులు – పావు కప్పు (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి)
ఖర్జూరం గుజ్జు – పావు కప్పు (గింజలు తీసి, ముక్కలు చేసి పెట్టుకోవాలి)
ఉప్పు – చిటికెడు, దాల్చినచెక్క పొడి – కొద్దిగా, కొబ్బరి పాలు – 100 గ్రాములు
కొబ్బరి తురుము – గార్నిష్‌కి సరిపడా (అభిరుచిని బట్టి), నెయ్యి – కొద్దిగా
తయారీ విధానమిలా:
ముందుగా మిక్సీ బౌల్‌లో ఖర్జూరం ముక్కలు, 50 గ్రాముల కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో చెర్రీ గుజ్జు, దాల్చినచెక్క పొడి, మిగిలిన కొబ్బరి పాలూ పొసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలో చాక్లెట్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కచ్చాబిచ్చాగా చేసుకున్న జీడిపప్పు ముక్కలు, వాల్‌నట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నేతిని చేతులకు రాసుకుని.. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని.. కొబ్బరి తురుముతో లేదా కోకోనట్ బటర్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇవి భలే రుచిగా ఉంటాయి.
Cherry Chocolate Balls Recipe: చెర్రీ చాక్లెట్ బాల్స్.. ఒక్కసారి రుచి చూస్తే వదలిపెట్టరు
Published Mon, Jul 31 2023 4:48 PM | Last Updated on Mon, Jul 31 2023 5:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment