క్యారట్ క్యాప్సికమ్ చట్నీ తయారీకి కావల్సినవి:
క్యారట్‌లు – పెద్దవి రెండు; క్యాప్పికం –పెద్దది ఒకటి; అల్లం – అంగుళన్నర ముక్క; పచ్చిమిర్చి –ఐదు;
జీలకర్ర –టీస్పూను; ధనియాలు –టీస్పూను; ఆవాలు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – టీస్పూను;
ఇంగువ – చిటికెడు; కరివే΄ాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – పావు కప్పు;
చింతపండు గుజ్జు – రెండు టీస్పూన్లు; నూనె – నాలుగు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానమిలా:
►క్యారట్, క్యాప్సికం, అల్లంను సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.జీలకర్ర, ధనియాలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
► బాణలిలో మూడు టీస్పూన్ల నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి, అల్లం, క్యారట్, క్యాప్పికం ముక్కలు వేసి వేయించాలి.
► కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి.
► వేయించిన ధనియాలు, జీలకర్ర మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి ∙ఇవి నలిగిన తరువాత ఉడికించిన క్యాప్సికం క్యారట్ ముక్కలను వేయాలి.
► చింతపండు గుజ్జు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
► మిగిలిన టీస్పూను నూనె వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత శనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి.
► చివరిగా ఇంగువ వేసి దించేయాలి ∙ఈ తాంలిపుని పచ్చడిలో కలిపితే క్యారట్ క్యాప్సికం చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ, రోటీల్లో ఇది మంచి కాంబినేషన్.
క్యారట్, క్యాప్సికంతో చట్నీ.. ఇడ్లీ, దోశల్లో మంచి కాంబినేషన్
Published Sat, Aug 26 2023 4:54 PM | Last Updated on Sat, Aug 26 2023 6:00 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment