
తాటి చాక్లెట్ పాన్‌కేక్ తయారీకి కావల్సినవి:
తాటిపండు గుజ్జు – ఒకటిన్నర కప్పులు
కోకో పౌడర్ – 1 కప్పు, మైదాపిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు
పంచదార – 2 కప్పులు
చిక్కటి పాలు – సరిపడా(కాచి చల్లార్చినవి)
ఉప్పు – చిటికెడు, నెయ్యి – చాలినంత
తయారీ విధానమిలా:
- ముందుగా తాటì పండు గుజ్జు, కోకోపౌడర్, కొబ్బరి తురుము, పంచదార కొద్దికొద్దిగా పాలు మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఆ మిశ్రమంతో పాటు.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్నపిండి, కోకో పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- తర్వాత పాన్‌లో నెయ్యి వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ చేసుకుని.. ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి. వాటిపై చాక్లెట్ క్రీమ్, ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.