
హబీసా దాల్మా తయారీకి కావల్సినవి:
పెసర పప్పు – కప్పు; అరటికాయ – పెద్దది ఒకటి; చేమదుంపలు – నాలుగు;
టొమాటో – ఒకటి; పచ్చిబొ΄్పాయి – చిన్నది ఒకటి; అల్లం – అంగుళం ముక్క;
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు – నాలుగు;
ఎండు మిర్చి – ఏడు; జీలకర్ర – మూడు టేబుల్ స్పూన్లు;
ఆవాలు – టీస్పూను; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు;
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానమిలా:
►ముందుగా నాలుగు ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. అరటికాయ, చేమ దుంపలు, బొప్పాయి తొక్కతీసి ముక్కలుగా తరగాలి. అల్లం, టొమాటోను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెసరపప్పు కడిగి కుక్కర్‌లో వేయాలి.అందులో మూడు కప్పుల నీళ్లు, అరటి, చేమ, బొప్పాయి, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు వేయాలి.
► రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. పెద్ద మంటమీద ఒక విజిల్ రానిచ్చి దించేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కిన నెయ్యిలో మిగిలిన ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ∙ఇవి వేగాక కుక్కర్‌లో ఉడికిన పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ∙ఇప్పుడు కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తరుము, మిర్చి, జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనిస్తే హబీసా దాల్మా రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment