క్యారెట్–కోకోనట్ ఢోక్లా తయారీకి కావల్సినవి:
క్యారెట్ తురుము – 1 కప్పు
సగ్గుబియ్యం – పావు కప్పు (పిండిలా చేసుకోవాలి)
బియ్యప్పిండి – పావు కప్పు, కొబ్బరి పాలు – అర కప్పు
నీళ్లు – సరిపడా, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు
కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు – కొద్దికొద్దిగా (అన్నింటినీ ఒక టీ స్పూన్ నూనెలో పోపు పెట్టుకోవాలి)
తయారీ విధానమిలా:
►ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని.. అందులో క్యారెట్ తురుము, బియ్యప్పిండి, సగ్గుబియ్యం పిండి, కొబ్బరి పాలు, చిటికెడు ఉప్పు వేసి సుమారు రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరోసారి బాగా కలిపి.. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అందులో నిమ్మరసం జోడించాలి.
► ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని, దానికి కొద్దిగా నూనె రాసి, దానిలో ఆ మిశ్రమాన్ని వేసుకుని చదునుగా చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి, పోపు పెట్టిన కరివేపాకు, ఆవాల మిశ్రమాన్ని వాటిపై వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అనంతరం కట్ చేసుకుని, సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment