![Sundar Pichai Watches Youtbe For Dishes Preparation - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/13/Sundar-Pichai.jpg.webp?itok=eZdS8vMp)
సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టడంలో సీఈఓ సుందర్ పిచాయ్ పాత్ర మరువలేనిది. అయితే ఆయన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. తాజాగా సుందర్ పిచాయ్ తాను ఖాళీ సమయాల్లో ఏ చేస్తుంటాడో ఓ ఈవెంట్లో తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో తన పిల్లలతో కలిసి పనీర్ మఖానీ, పిజాలు తదితర వంటకాలను ఏలా వండాలో యూట్యూబ్‌లో తెలుకున్నానని తెలిపారు.
కాగా తాను చిన్న వయస్సులో దూరదర్శన్ చానెల్‌లో సారే జహాసే లాంటి కార్యక్రమాలను చుసే వాడినని గుర్తుకు తెచ్చుకున్నారు. మరోవైపు తాను చిన్న వయస్సు నుంచే నూతన సాంకేతిక వైపే ఆలోచించే వాడినని చెప్పుకొచ్చారు. దేశంలో నూతన సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కోన్నారు. (చదవండి:సరిలేరు ‘సుందర్’కెవ్వరు..!)
Comments
Please login to add a commentAdd a comment