పనస పండుతో పాఠోలి స్వీట్‌, టేస్ట్‌ అదిరిపోద్ది | How To Make Panasa Patholi Steamed Jackfruit Recipe | Sakshi
Sakshi News home page

Panasa Patholi: పనస పండుతో పాఠోలి స్వీట్‌, టేస్ట్‌ అదిరిపోద్ది

Published Sat, Sep 16 2023 1:31 PM | Last Updated on Sat, Sep 16 2023 1:34 PM

How To Make Panasa Patholi Steamed Jackfruit Recipe - Sakshi

పనస పాఠోలి తయారీకి కావల్సినవి: 
బియ్యం – కప్పు; పనసపండు తురుము – ఒకటిన్నర కప్పులు (తొనలను సన్నగా తురమాలి);
పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; అరటి ఆకులు – పాఠోలీకి సరిపడా.
స్టఫింగ్‌ కోసం: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలుకలు పొడి – అరటీస్పూను.

పనసపండుతో పాఠోలి..

తయారీ విధానమిలా:
బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.మందపాటి బాణలిలో బెల్లం, నాలుగు టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి వేసి మరిగించాలి.
► బెల్లం కరిగి నురగలాంటి బుడగలు వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి తురుము వేయాలి. పాకంలో గరిట పెట్టి కలియతిప్పుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి.
► నీరంతా ఇంకిపోయినప్పుడు అర టీస్పూను యాలకుల పొడి కలిపి చల్లారనివ్వాలి.
► ఇప్పుడు నానిన బియ్యంలో నీళ్లు తీసేసి బ్లెండర్‌లో వేయాలి ∙దీనిలోనే పనసపండు తురుము, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్టులా గ్రైండ్‌ చేయాలి.
► గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి ∙ఇప్పుడు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి.
► రుబ్బుకున్న బియ్యం పేస్టుని అరటి ఆకులపైన మందపాటి పొరలాగా వేసుకోవాలి. పొర మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి ► చల్లారిన బెల్లం కొబ్బరి తురుముని పొరపైన మధ్యలో వేయాలి ∙ఇప్పుడు అరటి ఆకుని నిలువుగా మడిచి ఆవిరి పాత్రలో పెట్టుకోవాలి ∙ఈ ఆకులను ముఫ్పై నిమిషాల పాటు ఆవిరిమీద ఉడికిస్తే పనస పాఠోలీ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement