అలోవెరాతో ఐస్‌క్రీమ్‌.. ఎప్పుడైనా తిన్నారా? | Delicious Ice Cream Recipes: How To Make Aloevera Fruity Icecream Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Aloevera Icecream Recipe: అలోవెరాతో ఐస్‌క్రీమ్‌.. ఎప్పుడైనా తిన్నారా?

Published Thu, Sep 21 2023 3:17 PM | Last Updated on Thu, Sep 21 2023 3:55 PM

How To Make Aloevera Fruity Icecream Recipe In Telugu - Sakshi

అలోవెరా ఐస్‌క్రీమ్‌ తయారీకి కావల్సినవి:

కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు
కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి)
పుదీనా ఆకులు – 8
మిల్క్‌మెయిడ్‌ – అర కప్పు, మ్యాపుల్‌ సిరప్‌ – 1 టీ స్పూన్,
ఫ్రెష్‌ క్రీమ్‌ – 1 కప్పు (ఇవి మార్కెట్‌లో దొరుకుతాయి), ఫుడ్‌ కలర్‌ – గ్రీన్‌ కలర్‌ (అభిరుచిని బట్టి)



తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్‌ క్రీమ్‌ వేసుకుని.. హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్‌ క్రీమ్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్‌మెయిడ్, మ్యాపుల్‌ సిరప్, కొద్దిగా ఫుడ్‌ కలర్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్‌క్రీమ్‌ రెడీ అయిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement