Alovera
-
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్‌తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్‌లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్‌కి ప్రసిద్ధి. -
అలోవెరాతో ఐస్‌క్రీమ్.. ఎప్పుడైనా తిన్నారా?
అలోవెరా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి) పుదీనా ఆకులు – 8 మిల్క్‌మెయిడ్ – అర కప్పు, మ్యాపుల్ సిరప్ – 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు (ఇవి మార్కెట్లో దొరుకుతాయి), ఫుడ్ కలర్ – గ్రీన్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్ క్రీమ్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్‌మెయిడ్, మ్యాపుల్ సిరప్, కొద్దిగా ఫుడ్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. -
అలోవెరాతో ఇలా చేయండి.. మొటిమలు మటుమాయం
అలోవెరా.. దీనినే కలబంద అంటాం. దీంట్లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ప్రతి ఇంటి బాల్కనీలో ఉండాల్సిన మొక్క ఇది. విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య పరంగానే కాదు సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖంపై మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను పోగొట్టడంలో అలొవెరా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా వాడుతుంటారు. ► అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. ఎండకు చర్మం మండినా, కందిపోయినట్లు అనిపించినా వెంటనే ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. ►ఇందులో ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగోడుతుంది. ► స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మానికి అప్లై చేసుకొని 5నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే సబ్బుతో అవసరం లేకుండానే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోయి చర్మం కోమలంగా మారుతుంది. ► అలోవెరాని ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది. స్కిన్ కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ► అలోవెరాలో విటమిన్-సి, ఈ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వయసు పైబడిన వారు వారానికి మూడుసార్లు క్రమం తప్పకుండా అలోవెరాను రాసుకుంటే వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. ► మేకప్ రిమూవింగ్ క్రీమ్‌లాగా కూడా అలోవెరా జెల్ చక్కగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కాటన్ బాల్‌తో మేకప్‌ని సులువుగా తొలగించుకోవచ్చు. ► టీనేజర్లను ఎక్కువగా వేధించే సమస్య మొటిమలు. కాలుష్యం కారణంగా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ప్రతిరోజూ పడుకునే ముందు అలోవెరా జెల్‌ని రాసుకొని పొద్దునే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది. ► కలబందలో పసుపు, తులసి ఆకుల్ని మిక్సీ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. -
ఎండలు బాబోయ్ ఎండలు... చుండ్రు తగ్గేదెలా..?
వేసవిలో తలకి ఎక్కువ చెమట పట్టడం, దానికితోడు వాతావరణ కాలుష్యం వల్ల తల తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ►వేసవిలో చాలామందిని చుండ్రు సమస్య వేధిస్తుంటుంది. తలలో అమితంగా పొట్టు చేరడం, తలంతా దురద.. ఈ సమస్యలు ఎండాకాలంలో కాస్త ఎక్కువుంటాయి. అలాంటపుడు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవేమిటో చూద్దాం... ►వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది. ►నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి గంట తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ►పెరుగు కూడా బాగానే పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా చాలు. ►కలబంద గుజ్జును తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ ను కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ►పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్‌ను పావు కప్పు నీళ్లలో కల΄ాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు. చుండ్రు ఎందుకు వస్తుంది? ►చుండ్రుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, నిద్రలేమి. అయితే ఎండాకాలంలో చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ►షాంపూను ఎక్కువగా వాడటం వల్ల మాడు పొడుబారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వస్తుంది. ►కొందరికి జడను గట్టిగా బిగించి కట్టుకోవడం అలవాటు. అయితే అలా జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల గాలి తగలక సమస్య తీవ్రమవుతుంది. ►ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అందువల్ల తల మీద ఎండపడకుండా తలను కవర్ చేసేందుకు ఏమైనా వాడాలి. ►చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది. ఇవి పాటించాలి ►వారానికి మూడుసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడునుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువవుతుంది. ►తరచూ తల ముట్టుకోకూడదు. అంటే తలలో చేతులు పెట్టి గోక్కోకూడదు. చుండ్రు వల్ల దురద వస్తుంది. దాంతో తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది. సమస్య ఇంకాస్త పెరుగుతుంది. ►ఎండాకాలంలో హెయిర్ స్టైలింగ్ కోసమని క్రీములు, స్ప్రేలు ఎక్కువగా వాడితే అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి. ►వారానికి ఒకసారైనా ఏదైనా ఆయిల్‌తో కుదుళ్లకు బాగా మర్దనా చేసుకోవాలి. దీనివల్ల మంచి రక్త సరఫరా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది. -
Skin Care Tips: అలొవెరా జ్యూస్ తాగితే ఇన్ని ఉపయోగాలా?!
కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులు, పని ఒత్తిడి కారణమేదైనా.. మీ చర్మం సహజ కాంతిని కోల్పోతున్నట్లనిపిస్తే వెంటనే తగుజాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మానికి తీరని నష్టం వాటిల్లుతుంది. వీటితోపాటు మీ ఆహార అలవాట్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా అందే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా ఉంచేందుకు ఎంతో తోడ్పడతాయి. ఒకవేళ సహజమైన పద్ధతుల్లో మీ చర్మానికి చికిత్స అందించాలంటే అలోవెరా (కలబంద)కు మించిన ఔషధం మరొకటి లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అలొవెరా ఏ విధంగా చర్మకాంతిని మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం.. చర్మానికి కలబంద చేసే మేలు.. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు అధికంగా ఉంటాయి. డల్ స్కిన్, ముడతలకు కారణమయ్యేఫ్రీ రాడికల్స్ నివారణకు సహాయపడుతుంది. డీకే పబ్లిషింగ్ హౌస్ వారి ‘హీలింగ్ ఫుడ్స్’బుక్ ప్రకారం బేటా కెరోటిన్, సి, ఇ, బి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాల నివారణకు అలొవెరా ఉపయోగంలో ఉంది. అలొవెరా జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే.. కలబందను జ్యూస్ రూపంలో తాగడం చాలా ఉత్తమమైన మార్గం. మీడియం సైజులో ఉండే ఒక అలొవెరా ఆకును తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పై తోలును తొలగించి జెల్‌ను ఒక గిన్నెలో వేసి నీళ్లతో శుభ్రం చేయాలి. దీనిలో పైనాపిల్,యాపిల్ ముక్కలను వేపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అంతే! కలబంద జ్యూస్ రెడీ!! ఈ విధంగా తయారుచేసుకున్న జ్యూస్ ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! -
ముఖ కాంతికి పెరుగు, క్యారెట్
సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్ ప్యాక్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది. ►రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కీరా రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి వేళ్లతో మృదువుగా రుద్దాలి.æపాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది. ►రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. ►రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్ అరకప్పు పెరుగులో కలపాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మెరుపు పెరుగుతుంది. -
మేనికి బొప్పాయి
ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ►ఇక ఈ కాలం సన్‌ప్రొటెక్షన్ లోషన్లు, మాయిశ్చరైజర్‌ని ఎంపిక చేసుకొని వాడాలి. వీటిని బయటకు వెళ్లడానికి ముందు 10 నిమిషాల ముందు రాసుకుంటే ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ►శిరోజాలకు వారానికి ఒకసారి కండిషనర్ను తప్పక ఉపయోగించాలి. అరటిపండు గుజ్జును తలకు పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. ►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. -
సీక్రెట్ చెవిలో కాదు.. బయటికే చెప్పేస్తా!
తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది... అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే ‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది. కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు. -
యంత్రంతో మంత్రం వేశాడు!
ఫ్లాష్ బ్యాక్ ఢిల్లీకి చెందిన ధరమ్‌వీర్‌సింగ్ కాంబోజీ కనుగొన్న మల్టీపర్పస్ యంత్రం హైటెక్ యంత్రాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే. ఇది దేనికి పని కొస్తుందనుకుంటున్నారా? ఔషధ మూలికల నుంచి రసం తీసేందుకు, వాటిని పొడి చేసేందుకు, ముద్దగా రుబ్బేందుకు ఉప యోగపడుతుంది. కాయలు, గింజలు, చిరు ధాన్యాలు, పప్పులు వంటి వాటిని కూడా ఇది ఇట్టే ప్రాసెస్ చేసేయగలదు. ధరమ్వీర్ సింగ్ శాస్త్రవేత్త కాదు. ఇంజినీరూ కాదు. పట్టుమని పదోతరగతి కూడా చదువుకో లేదు. ఢిల్లీ వీధుల్లో రిక్షా తొక్కుతూ పొట్ట పోసుకునేవాడు. అయితే, చిన్నప్పటి నుంచి ఆయుర్వేదంపై, వనమూలికలపై ఆసక్తి ఉండటంతో కొందరు సాధువుల వద్ద మూలికలతో ఔషధాలను తయారుచేసే పద్ధతులు నేర్చున్నాడు. 2004లో హర్యానా ప్రభుత్వం తరఫున రాజస్థాన్ వెళ్లిన రైతుల బృందంతో కలసి, అక్కడి అలోవెరా, ఆమ్లా ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించాడు. అలాంటి యంత్రాలతో స్వయంగా ఏదైనా చేద్దామని భావించినా, వాటి ఖరీదు తన శక్తికి మించినది కావడంతో అప్పటికి మిన్నకున్నాడు. అయితే, రెండేళ్ల వ్యవధిలో స్వయంగా అలోవెరా రసాన్ని తీసే యంత్రాన్ని తయారు చేశాడు. ఇది విజయవంతంగా పని చేయడంతో, కొద్ది కాలానికే ఈ యంత్రానికి మార్పు చేర్పులు చేసి, ఎలాంటి మూలికలు, ఆహార ధాన్యాలనైనా ప్రాసెస్ చేయగల పూర్తిస్థాయి మల్టీపర్పస్ యంత్రంగా రూపొందించాడు. గంటకు 50 కిలోలు, గంటకు 150 కిలోల పదార్థాలను ప్రాసెస్ చేయగల రెండు నమూనాల్లో ఈ యంత్రాన్ని తయారు చేసి, విజయవంత మైన పరిశ్రమకు యజమానిగా మారాడు. ఇప్పుడు ఇతని వద్ద డజను మంది కార్మికులు పనిచేస్తున్నారు.