
బ్రెడ్ – యాపిల్ కుల్ఫీ తయారీకి కావల్సినవి
బ్రెడ్ స్లైసెస్ – 4 (నలువైపు బ్రౌన్ కలర్ ముక్కను తొలగించి.. మిగిలిన ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి)
యాపిల్ ముక్కలు – అర కప్పు
చిక్కటి పాలు – 2 కప్పులు
పంచదార – పావు కప్పు (పెంచుకోవచ్చు)
డ్రైఫ్రూట్స్ ముక్కలు – పావు కప్పు (అభిరుచిని బట్టి)
కుంకుమ పువ్వు – కొద్దిగా
తయారీ విధానమిలా
ముందుగా బౌల్‌లో పాలు పోసుకుని గరిటెతో తిప్పుతూ కాచుకోవాలి. పంచదార, కుంకుమ పువ్వు వేసుకుని తిప్పుతూ సగం వరకూ మరిగించుకుని చల్లారబెట్టాలి. తర్వాత యాపిల్, బ్రెడ్ పౌడర్‌ను మిక్సీలో వేసుకుని.. ఒకసారి మిక్సీ పట్టి.. అందులో చల్లార్చిన పాలను పోసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా కుల్ఫీ మేకర్‌లో వేసుకుని.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.